Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Aatma Niyamamu Dwaara Saagi Povudamu

ఆత్మ నియమము ద్వారా సాగి పోవుదము

Aatma Niyamamu Dwaara Saagi Povudamu

Verse
ఆత్మ నియమము ద్వారా - సాగి పోవుదము
విశ్వాసమునకు కర్తయు దానిని
కొనసాగించు యేసుని జూచుచు
ఓపికతో మనము సాగి పోవుదము
Verse
భక్తి హీనులకు నీతిని జాటుచు - జల ప్రళయమున
ఓడలో జేరిన - నోవహువలె మనము సాగి పోవుదము
Verse
సిద్ధపరచిన పురమును - జేర వాగ్దానములను
నమ్మి నడిచిన అబ్రహాము వలె - సాగి పోవుదము
Verse
ఘోరమైనయా జారత్వమునకు - దూరముగాను
పారిపోయిన - యోసేపుని బోలి సాగి పోవుదము
Verse
దేవుని ప్రజలతో శ్రమయే మేలని - ఐగుప్తు పాపపు
భోగము విడిచిన మోషేవలె మనము సాగి పోవుదము
Verse
పరిశుద్ధాత్మతో నిండిన వాడై - దైర్యముగా వాక్యమును
బోధించిన పేతురు వలె మనము సాగి పోవుదము
Verse
పోరు సహించి సువార్త పక్షమున - పరుగు ముగించి
పానార్పణమైన - భక్త పౌలు వలే సాగి పోవుదము
Verse
తేటగ దైవ సంకల్పము దెల్పుచు - రాళ్ళను రువ్వగ
ప్రాణము విడిచిన - స్తెఫనువలె మనము సాగి పోవుదము

Related Tags

FaithChristian LifePerseverance