Verse
ఆత్మ విషయమై - దీనులైనవారు
ధన్యులు పరలోక - రాజ్యము వారిది
దుఃఖపడువారు - ధన్యులు ధన్యులు
వారు ఓదార్చ - బడుదురు
Verse
సాత్వీకులు ధన్యులు వారు
భూలోకమును స్వ - తంత్రించుకొందురు
నీతికొర కాకలి - దప్పులు గలవారు
ధన్యులు వారు తృప్తి - పరచబడుదురు
Verse
కనికరములుగల - వారు ధన్యులు
వారు కనికరము - పొందుదురు
హృదయశుద్ధిగల - వారు ధన్యులు
వారు దేవుని - చూచెదరు
Verse
సమాధానపరచు - వారు ధన్యులు వారు
దేవుని కుమారు - లనబడుదురు
నీతి నిమిత్తము హిం - సింపబడువారు
ధన్యులు పరలోక - రాజ్యము వారిది
Verse
నా నిమిత్తము జనులు - మిమ్మును నిందించి
హింసించి మీ మీద - అబద్ధముగా
చెడ్డ మాటలెల్ల - పలుకు నపుడు
మీరు ధన్యులు - మీరు ధన్యులు
Verse
సంతోషించి ఆనందించుడి పరలోకమందు
మీ ఫలము అధికమగును
ఈలాగున వారు - మీకు పూర్వమందు
ఉండిన ప్రవక్తలను - హింసించిరి