Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Aavedana Nenondanu

ఆవేదన నేనొందను

Aavedana Nenondanu

Verse
ఆవేదన నేనొందను
అవమానముతో నే కృంగను
ఆనందమే నా జీవితం‖ 2x ‖
నా యేసుని బాహూవులో
హల్లెలూయా హల్లెలూయా‖ 2x ‖
హల్లెలూయా ఆనందమే‖ ఆవేదన ‖
Verse
నాకేమి కావలెనో నేనేమి కోరెదనో‖ 2x ‖
నా ఊహలకు ఊపిరి పోసి
కోరిన ఈవుల నొసగిన ఉన్నతమైన అద్భుతమైన
నీ కార్యములు ఆశ్చర్యమే‖ 2x హల్లెలూయా ‖
Verse
కష్టాల కెరటాల సుడిగుండమందున‖ 2x ‖
కలవరమొంది కృంగిన నన్ను
కరుణతో పరమున చేర్చి శిఖరముపైన నిలిపిన దేవా
కృపలన్నియు కురిపించితివి‖ 2x హల్లెలూయా ‖

Related Tags

FaithComfortHope