Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Aayane Naa Sangeethamu

ఆయనే నా సంగీతము

Aayane Naa Sangeethamu

Lyricist: Andhra Kraisthava Keerthanalu
Verse
ఆయనే నా సంగీతము బలమైన కోటయును
జీవాధిపతియు ఆయనే
జీవిత కాలమెల్ల స్తుతించెదము‖ ఆయనే ‖
Verse
స్తుతుల మధ్యలో నివాసం చేసి
దూతలెల్ల పొగడే దేవుడాయనే‖ 2x ‖
వేడుచుండు భక్తుల స్వరము విని
దిక్కు లేని పిల్లలకు దేవుడాయనే‖ 2x ఆయనే ‖
Verse
ఇద్దరు ముగ్గురు నా నామమున
ఏకీభవించిన వారి మధ్యలోన‖ 2x ‖
ఉండెదననిన మన దేవుని
కరములు తట్టి నిత్యం స్తుతించెదము‖ 2x ఆయనే ‖
Verse
సృష్టికర్త క్రీస్తు యేసు నామమున
జీవిత కాలమెల్ల కీర్తించెదము‖ 2x ‖
రాకడలో ప్రభుతో నిత్యముందుము
మ్రొక్కెదము స్తుతించెదం పొగడెదము‖ 2x ఆయనే ‖

Related Tags

PraiseWorship