Verse 1
మధురం మధురం మధురమే శ్రీయేసుని నామ స్మరణం
మధురాతి మధురం మధురమే ప్రభుయేసుని వాక్య ధ్యానం
నాదు బ్రతుకునే దర్శించి - చేదు జీవితం ఛేదించి
మధుర మకరందమందించి - మదిలో సిరులే కురిపించి
మహిమాత్మతో నను వెలిగించిన యేసుని నామం యేసుని వాక్యం
Verse 2
సర్వజ్ఞాని ప్రభుయేసే - సర్వవ్యాపి శ్రీయేసే,
సర్వశక్తి సంపన్నుడు యేసే సర్వోన్నతుడు యేసే - 2
మా మదినే గుడిగా మలచి - మా గుండెల్లో కొలువుండి - 2
వెతలను బాపి స్థితులను మార్చిన స్తుతులకు పాత్రుడు యేసే ||మధరం ||
Verse 3
ఆత్మరూపి ప్రభుయేసే - వాగ్రూపి శ్రీయేసే
అంతరంగమున ఆత్మదీపమును వెలిగించినది యేసే - 2
అక్షయమైన జీవాహారంతో-అంతకంతకు మహిమను నింపుతూ - 2
అంతమువరకు ఎంతో ప్రేమను వింతగ చూపును యేసయ్యా ||మధరం ||