Verse 1
క్రీస్తు సైన్యమై సమైక్యమై - కదనరంగమందు దూకుదాం
సజీవ వాక్య కరవాలం దూసి - చీకటి శక్తులను కూల్చుదాం || క్రీస్తు ||
Verse 2
రాజులైన యాజక సమూహమై - రాజ వంశపు గౌరవార్ధమై
రాజ ఠీవితో - సదా రాజభక్తితో
రాజ్యమునకై పోరాడెదన్ - రాజు ఏసుతో నిలిచెదం ||క్రీస్తు ||
Verse 3
మన రాజు యేసుపై లక్ష్యముంచెదం - అక్షయ రాజ్యమునకై నిరీక్షించెదం
నశించు ఆత్మలను - రక్షించు లక్ష్యంతో
దీక్షతో పోరాడెదమ్ - సాక్ష్యులై జీవించెదమ్ ||క్రీస్తు ||
Verse 4
జీవితమే అవిరామ సంగ్రామము - సర్వాంగ కవచమే ధరించుకుందాము
విశ్వాస వీరులమై అపవాది నోడించి
సిలువ ధ్వజం ఎగుర వేసెదం - క్రీస్తు మహిమ ధరను చాటెదం ||క్రీస్తు ||