Verse 1
చూడరే సిలువను వ్రే-లాడు యేసయ్యను
పాడు లోకంబునకై – గోడు జెందె గదా ||చూడరే||
Verse 2
నా చేతులు చేసినట్టు – దోషంబులే గదా
నా రాజు చేతులలో ఘోరంపు జీలలు ||చూడరే||
Verse 3
దురితంపు దలఁపులే – పరమ గురిని శిరముపై
నెనరు లేక మొత్తెనయ్యొ – ముండ్ల కిరీటమై ||చూడరే||
Verse 4
పరుగెత్తి పాదములు – చేసిన పాపంబులు
పరమ రక్షకుని – పాదములలో మేకులు ||చూడరే||
Verse 5
పాపేఛ్చ తోడ గూడు – నాడు చెడ్డ పడకలే
పరమ గురుని ప్రక్కలోని – బల్లెంపు పోటులు ||చూడరే||