Verse 1
వివాహమన్నది పవిత్రమైనది
ఘనుడైన దేవుడు ఏర్పరచినది
Verse 2
దేహములో సగ భాగముగా - మనుగడలో సహచారిణిగా
నారిగా సహకారిగా స్త్రీని నిర్మించినాడు దేవుడు
Verse 3
ఒంటరిగా వుండరాదని - జంటగా నుండ మేలనీ
శిరస్సుగా నిలవాలని పురుషుని నియమించినాడు దేవుడు
Verse 4
దేవునికీ అతి ప్రియులుగా ఫలములతో వృద్ధి పొందగ
వేరుగా నున్న వారిని ఒకటిగ ఇల చేసినాడు దేవుడు