Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Abraahaamu Issaaku Yaakobunaku

అబ్రాహాము ఇస్సాకు యాకోబునకు

Abraahaamu Issaaku Yaakobunaku

Chorus
అబ్రాహాము ఇస్సాకు యాకోబునకు దేవుడవు
(యేసయ్యా) భూ రాజులందరికి భూ జనులందరికి పూజ్యుడవు‖ 2x అబ్రాహాము ‖
Verse
అబ్రాహాము విశ్వాసులకు తండ్రి అని
ఇస్సాకునకు ప్రతిగా గొరియపిల్లనిచ్చి‖ 2x ‖
యాకోబును ఇశ్రాయేలని దీవించి
ఈ పాపిని నీవు విడువక ప్రేమించి
నా మంచి యేసయ్యా – నీవున్న చాలయ్యా
నీ చేతి నీడలో జీవింతునయ్యా‖ 2x అబ్రాహాము ‖
Verse
జీవాహారము నేనే అని పలికితివి
జీవ జలముల ఓరన నను నాటితివి‖ 2x ‖
నిర్జీవమైన నన్ను సజీవునిగా చేసి
హృదయము నుండి జీవ జలములు పుట్టించి
నీ జీవాహారము – నీ జీవజలమును
నాకిచ్చినందుకు స్తోత్రము చెల్లింతును‖ 2x అబ్రాహాము ‖

Related Tags

PraiseWorship