Intro
అబ్రహము దేవుడవు నీవే యేసయ్య
దేవ కుమారుడవు నీవే మెస్సయ్య
ధావన పావన బావా నిరంతర
చింత తీర్చి శాంతి నిచ్చు ప్రేమ పావనుడా
Chorus
నీవే మాకు తోడుగా, నీవే మాకు నీడగా
మాతో ఉండగా భయమేల
Verse
సింహాల బోనులో పడిన వేళలో
ప్రార్ధన చేయగా కాపాడినావు
మండే మంటలలో పడిన వేళలో
నీవే తోడుగా మాతో ఉన్నావు
Verse
కూలిన బ్రతుకులు కట్టే వాడవు
ఎతైన కోటగా నాకై ఉన్నావు
కట్టిన కట్లను తెంపే వాడవు
ఉన్నవాడా నీవే మాతో ఉన్నావు