Verse 1
యధార్ధహృదయుల విన్నపాలను ఆలకించుదేవా
దీనమనస్కులను దీవించే ప్రభువా - 2
నీ సన్నిధిలో చేరి ప్రార్ధించగా
నీ కృప కొరకు నేను కనిపెట్టగా
ఆలకించితివి ఉత్తరమిచ్చితివి - 2 || ఆరాధనా ||
Verse 2
కృంగిన వేళలో నిరాశలోయలలో
మా దరి చేరి లేవనెత్తి ఉద్దరించితివి - 2
వేల్పులలో నీవంటి వారెవ్వరూ - నీవు గాక మాకిలలో దిక్కెవ్వరూ
నీవే సత్యదేవుడవు - నీవే నిత్య దేవుడవు - 2 ||యధార్థ ||
Verse 3
హృదయ రహస్యములు - ఎరిగిన దేవుడవు
అంతరంగములో సత్యమును - కోరుచున్నవాడవు - 2
మా హృదిలో ప్రతి అణువు నీ తలపులె - మా ప్రతి కదలిక నీ వైపే
నీ చిత్తమంతయు మాలో జరిగించుము దేవా - 2 ||యధార్థ ||