Verse 1
నీవే నా జీవిత రధసారధి
నీవే నా జీవన ఆధారము
ఇమ్మానుయేలువు నీవే - 2
ఇమ్మానుయేలువు నీవే నా ఇమ్మానుయేలువు నీవే || నీవే ||
Verse 2
అగ్ని కెరటాలలో నేను నడచిననూ - 2
జ్వాలలే నను కాల్చజాలవు నీవు నాకు తోడుండగా ||ఇమ్మానుయేలువు ||
Verse 3
నా చేతి పనులన్నిటిలో నాకు తోడైతివే - 2
నీ చేతి నీడలో ననుదాచి కాచితివే ||ఇమ్మానుయేలువు ||
Verse 4
నా ఆపదలన్నిటిలో నను ఆదుకొంటివే - 2
నా ఆశ్రయదుర్గమై ఆశలన్నియు తీర్చితివే ||ఇమ్మానుయేలువు ||