Verse 1
ఏలాంటి వాడవైనా - నీ వెంత ఘనుడవైనా
కనుమూసే కాలమొక రోజు ఉన్నదని - మరువబోకుమన్నా || ఏలాంటి ||
Verse 2
నీకుమేడ మిద్దెలున్న నీవు ప్రభుని - చూడలేవు - 2
మోకాళ్లు వంచి నీవు - మొరలు పెట్టి ప్రభునడిగి చూడుమన్నా ||ఏలాంటి ||
Verse 3
నీకు ధనము బలగమున్న - నీవు విర్రవీగకన్నా - 2
ఆ ధనముకాస్తా కరిగిపోతే - దరికెవరురారు సున్నా ||ఏలాంటి ||
Verse 4
పాపుల కొరకు ప్రభువు - కల్వరిగిరిపైన - 2
ఆ సిల్వ వేసి దుర్మార్గులంత - పలు బాధ పెట్టిరన్నా ||ఏలాంటి ||
Verse 5
నీవు పాప రోగివయ్య - ప్రభు పిలచుచున్నాడయ్య - 2
ఆ ప్రభువునే పాదాల సాక్షిగా -ఎరిగినడువు తనయ ||ఏలాంటి ||