Verse
అడవి చెట్ల నడుమ
ఒక జల్దరు వృక్షం వలె
పరిశుద్ధుల సమాజములో
యేసు ప్రజ్వలించుచున్నాడు‖ 2x ‖
కీర్తింతున్ నా ప్రభుని
జీవ కాలమెల్ల ప్రభు యేసుని
కృతజ్ఞతతో స్తుతించెదను‖ 2x ‖
Verse
షారోను రోజా ఆయనే
లోయ పద్మమును ఆయనే
అతిపరిశుద్ధుడు ఆయనే
పదివేలలో అతిశ్రేష్టుడు‖ 2x కీర్తింతున్ ‖
Verse
పరిమళ తైలం నీ నామం
దాని వాసన వ్యాపించెగా
నింద శ్రమ సంకటంలో
నను సుగంధముగా చేయున్‖ 2x కీర్తింతున్ ‖
Verse
మనోవేదన సహించలేక
సిలువ వైపు నే చూడగా
లేవనెత్తి నన్నెత్తుకొని
భయపడకుమని అంటివి‖ 2x కీర్తింతున్ ‖
Verse
నా త్రోవకు దీపం నీవే
నా బ్రతుకుకు జీవం నీవే
నా సేవకు బలము నీవే
నా ఆత్మకాదరణ నీవే‖ 2x కీర్తింతున్ ‖
Verse
ఘనమైన నా ప్రభువా
నీ రక్త ప్రభావమున
నా హృదయము కడిగితివి
నీకే నా స్తుతి ఘనత‖ 2x కీర్తింతున్ ‖
Verse
నీవు నా దాసుడవనియు
ఏర్పరచుకొంటినని
నేనే నీ దేవుడనని
భయపడకు-మని అంటివి‖ 2x కీర్తింతున్ ‖