Verse
అడవి చెట్ల నడుమ – ఒక జల్దరు వృక్షం వలె
పరిశుద్ధుల సమాజములో
యేసు ప్రజ్వలించుచున్నాడు‖ 2x ‖
కీర్తింతున్ నా ప్రభుని
జీవ కాలమెల్ల ప్రభు యేసుని
కృతజ్ఞతతో స్తుతించెదను‖ 2x ‖
Verse
షారోను రోజాయనే – లోయ పద్మమును ఆయనే
అతిపరిశుద్ధుడు ఆయనే
పదివేలలో అతిశ్రేష్టుడు‖ 2x కీర్తింతున్ ‖
Verse
మనోవేదన సహించలేక – సిలువ వైపు నే చూడగా
లేవనెత్తి నన్నెత్తుకొని
భయపడకుమని అంటివి‖ 2x కీర్తింతున్ ‖
Verse
ఘనమైన నా ప్రభువా – నీ రక్త ప్రభావమున
నా హృదయము కడిగితివి
నీకే నా స్తుతి ఘనత‖ 2x కీర్తింతున్ ‖