Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Adavi Chetla Naduma Oka Jaldaru Vruksham Vale

అడవి చెట్ల నడుమ ఒక జల్దరు వృక్షం వలె

Adavi Chetla Naduma Oka Jaldaru Vruksham Vale

Verse
అడవి చెట్ల నడుమ - ఒక జల్దరు వృక్షం వలె
పరిశుద్ధుల సమాజములో - యేసు ప్రజ్వలించుచున్నాడు‖ 2x ‖
Verse
కీర్తింతున్ నా ప్రభుని - జీవకాలమెల్ల ప్రభుయేసుని
కృతజ్ఞతతో స్తుతించెదను‖ 2x ‖
Verse
షారోను రోజా ఆయనే - లోయ పద్మమును ఆయనే
అతి పరిశుద్ధుడు ఆయనే - పదివేలలో అతిశ్రేష్ఠుడు‖ 2x ‖
Verse
పరిమళతైలం నీ నామం - దాని వాసన వ్యాపించెగా
నిందశ్రమ సంకటములలో - నను సుగంధముగా చేయున్
Verse
మనోవేదన సహించలేక - సిలువవైపునే చూడగా
లేవనెత్తి నన్నెత్తుకొని - భయపడకుమని యంటివి
Verse
నా త్రోవకు దీపం నీవే - నా బ్రతుకుకు జీవం నీవే
నా సేవకు బలము నీవే - నా ఆత్మకాదరణనీవే
Verse
ఘనమైన నా ప్రభువా - నీ రక్త ప్రభావమున
నా హృదయము కడిగితివి - నీకే నా స్తుతి ఘనత
Verse
నీవు నా దాసుడవనియు - ఏర్పరచుకొంటినని
నేనే నీ దేవుడని - భయపడకు మని అంటివి

Related Tags

PraiseWorshipJesus