Chorus
అడవి పుష్పమా సంతోషించుమా – కస్తురీ పుష్పమా ఉల్లసించుమా
ఎండిన భూమి అరణ్యమా – సంగీతములు పాడుమా‖ 2x అడవి పుష్పమా ‖
Verse
లెబనోను సౌందర్యమూ – నీకు కలుగునుగా
షారోను పరిమళమూ – నీకు ఉండునుగా
కర్మెలు సొగసు దేవుని తేజస్సు నీకు ఇచ్చునుగా‖ 2x అడవి పుష్పమా ‖
Verse
సడలిన చేతులను – బలపరచిన దేవుడు
తొట్రిల్లు మోకాళ్ళను – ద్రుడపరచిన నాథుడు
భయము నొందకు నీ దేవుడు శక్తివంతుడు‖ 2x అడవి పుష్పమా ‖