Chorus
అడవి వృక్షములలో - జల్ధరు వృక్షము మెట్లున్నదో
పరిశుద్ధుల మధ్యలో - అతి శ్రేష్టుడైన నా ప్రభువు
పొడెద నా ప్రియుని జీవకాలమెల్ల అరణ్య యాత్రలో
కృతజ్ఞతతో పాడెదను‖ 2x ‖
Verse
దూషణ ఇరుకులలో - నన్ను సుగంధముగా - మార్చెను‖ 2x ‖
నీ కృపలో నన్ను నడిపి - నీ వెలుగుతో నింపితివి‖ 2x పొడెద ‖
Verse
నా కష్టతరంగములో - దు:ఖ సాగరములోనుండగా
నీకుడి హస్తము చాపి - భయపడకని పలికితివే‖ 2x పొడెద ‖
Verse
ఆనంద భరితుడనై - నీ ప్రేమలో నుండుటకు
నీ సర్వము - నా కతి మధురం -
నీ ముఖము మనోహరము‖ 2x పొడెద ‖
Verse
నీ చిత్తము - చేయుటకు
నన్ను నీకు సమర్పించెదన్
నా పరుగును తుద ముట్టించి
నీ సన్నిధిలో - నిలిచెదన్‖ 2x పొడెద ‖