Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Adbhutha Deevenalu Prabhuvaa Kummarinchithivi

అద్భుత దీవెనలు ప్రభువా కుమ్మరించితివి

Adbhutha Deevenalu Prabhuvaa Kummarinchithivi

Chorus
అద్భుత దీవెనలు - ప్రభువా కుమ్మరించితివి
నీదు ప్రేమ అపారము - ప్రభువా మాపై జూపితివి
Verse
మానవుని చేసినావు - నీ స్వంత రూపమునకు
నీ కిష్టులముగా బ్రతికి - దీవెనలెన్నో పొందెదము
Verse
నూతన జన్మవలన - ఆశీర్వాదములు దొరికె
శాపమును దూరపరచి - సర్వంబు క్రొత్తజేసె
Verse
లోకమునుండి వేరై - సిలువను మోయవలెను
అప్పుడే ప్రభు దీవించు - స్వాస్థ్యమును గాంచుమెంతో
Verse
తన సుతులుగాను మెలిగి - తన చిత్తమందు నిలిచి
జీవజలమును పొంది - దేవెనలెన్నో పొందెదము
Verse
ఆత్మీయముగ నడిచి - శరీర క్రియలను విడిచి
ఆయన స్వరము వినుచు - దీవెనలెన్నో పొందెదము
Verse
ఆశీర్వాదముల కొరకు - పిలువబడియున్న మనము
ఆజ్ఞలను నెరవేర్చినతో - దీవెనలెన్నో పొందెదము

Related Tags

GraceChristian LifeBlessing