Verse
అదే అదే ఆ రోజు
యేసయ్య ఉగ్రత రోజు
ఏడేండ్ల శ్రమల రోజు
పాపులంతా ఏడ్చే రోజు‖ అదే అదే ‖
Verse
సూర్యుడు నలుపయ్యే రోజు
చంద్రుడు ఎరుపయ్యే రోజు‖ 2x ‖
భూకంపం కలిగే రోజు
దిక్కు లేక అరచే రోజు
ఆ రోజు శ్రమ నుండి
తప్పించే నాథుడు లేడు‖ అదే అదే ‖
Verse
వ్యభిచారులు ఏడ్చే రోజు
మోసగాళ్ళు మసలే రోజు‖ 2x ‖
అబద్ధికులు అరచే రోజు
దొంగలంతా దొరికే రోజు
ఆ రోజు శ్రమ నుండి
తప్పించే నాథుడు లేడు‖ అదే అదే ‖
Verse
పిల్ల జాడ తల్లికి లేక
తల్లి జాడ పిల్లకు లేక‖ 2x ‖
చేట్టుకొక్కరై పుట్టకొక్కరై
అనాథలై అరచే రోజు
ఆ రోజు శ్రమ నుండి
తప్పించే నాథుడు లేడు‖ అదే అదే ‖
Verse
ఓ మనిషి యోచింపవా
నీ బ్రతుకు ఎలా ఉన్నదో‖ 2x ‖
బలము చూసి భంగ పడకుమా
ధనము చూసి దగా పడకుమా
ఆ రోజు శ్రమ నుండి
తప్పించే నాథుడు లేడు‖ అదే అదే ‖