Verse 1
అతడు రాజు ఆమె రాణి
ఏదేను వనమున ఆదాము హవ్వలు
అంద చందాలతో అలరారి వారు
సృష్టికర్త దేవుడే చేసెను వారికి పెండ్లి - 2 || అతడు ||
Verse 2
పెండ్లినాడు ఆదాము పాడెనొక పాట
వైవాహిక జీవితమున వేసెనొక బాట
సృష్టికర్త దేవుడే స్వరకల్పన చేసాడు
నా ఎముకలలో ఒక ఎముక - నా మాంసములో మాంసమా
నరుని నుండి తీయబడిన నారి నా ప్రియ సహచారి
స్వాగతం - స్వాగతం - సుస్వాగతం - 2 ||అతడు ||
Verse 3
సాటియైన సహాయము సాత్వియైన
తోటకంత యజమాని నేటి నాయకుడు
సృష్టికర్త దేవుడే దీవించెను వారిని - 2
ఫలియించుడి అభివృద్ధి పొందుడి
విస్తరించి భూమిని నిండించి - దానిని లోబర్చుకొనుడి - 2 ||స్వాగతం ||
Verse 4
ఇతడు రాజు ఈమె రాణి
అతడు రాజు ఆమె రాణి
సంసార వనమును చక్కదిద్దుకుంటారు
సృష్టికర్త దేవుని దీవెనలు పొంది
యేసును సంఘమును - పోలి జీవించుడి - 2 ||స్వాగతం ||