Verse 1
నడవాలని యేసు నడవాలని
నడవాలని నీతో నడవాలని
నాకున్న ఆశ నీపైనే ధ్యాస (2)
నిరంతరం నీతోనే నడవాలని (2)
Verse 2
హానోకు నీతో నడిచాడు దేవ
పరలోకపు నడకతో చేరాడు నిన్ను ||నడవా||
Verse 3
నోవాహు నీతో నడిచాడు దేవ
రక్షణనే ఓడలో రక్షింప బడెను ||నడవా||
Verse 4
అబ్రాహాము నీతో నడిచాడు దేవ
విశ్వాసపు యాత్రలో సాగాడు నీతో ||నడవా||
Verse 5
నా జీవితమంతా నీతో నడవాలని
నా చేయి పట్టుకొని నడిపించు ప్రభువా ||నడవా||