Chorus
అదే అదే ఆ రోజూ - యేసయ్య ఉగ్రత రోజు
ఏడేండ్ల శ్రమల రోజూ - పాపులంతా ఏడ్చే రోజు
Verse
సూర్యుడు నలుపయ్యే రోజూ - చంద్రుడు ఎరుపయ్యే రోజూ‖ 2x ‖
భూకంపం కలిగే రోజూ - దిక్కులేక అరచే రోజూ
ఆ రోజు శ్రమనుండి - తప్పించే నాథుడు లేడు..
Verse
వ్యభిచారులు ఏడ్చే రోజూ - మోసగాళ్ళు మసలే రోజూ‖ 2x ‖
అబద్ధికులు అరచే రోజూ - దొంగలంతా దొర్లే రోజూ
ఆ రోజు శ్రమనుండి - తప్పించే నాథుడు లేడు..
Verse
పిల్ల జాడ తల్లికి లేదు - తల్లి జాడ పిల్లకు లేదు‖ 2x ‖
చెట్టుకొక్కరై పుట్టకొక్కరై - అనాథలై అరచే రోజు
ఆ రోజు శ్రమనుండి - తప్పించే నాథుడు లేడు..
Verse
ఓ మనిషీ... యోచింపవా - నీ బ్రతుకు ఎలా ఉన్నదో‖ 2x ‖
బలము చూచి భంగపడకుమా - ధనము చూసి దగాపడకుమా
ఆ రోజు శ్రమనుండి - తప్పించే నాథుడు లేడు..