Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Adhigadhigo Alladhigo

అదిగదిగో అల్లదిగో

Adhigadhigo Alladhigo

Chorus
అదిగదిగో అల్లదిగో
కల్వరి మెట్టకు దారదిగో
ఆ ప్రభువును వేసిన సిలువదిగో‖ అదిగదిగో ‖
Verse
గెత్సేమను ఒక తోటదిగో
ఆ తోటలో ప్రార్ధన స్థలమదిగో‖ 2x ‖
అచటనే యుండి ప్రార్ధించుడని‖ 2x ‖
పలికిన క్రీస్తు మాటదిగో‖ 2x అదిగదిగో ‖
Verse
శిష్యులలో ఇస్కరియోతు
యూదాయను ఒక ఘాతకుడు‖ 2x ‖
ప్రభువును యూదులకప్పగింప‖ 2x ‖
పెట్టిన దొంగ ముద్దదిగో‖ 2x అదిగదిగో ‖
Verse
లేఖనము నెరవేరుటకై
ఈ లోకపు పాపము పోవుటకై‖ 2x ‖
పావనుడేసుని రక్తమును గల‖ 2x ‖
ముప్పది రూకల మూటదిగో‖ 2x అదిగదిగో ‖
Verse
చలి కాచుకొను గుంపదిగో
ఆ పేతురు బొంకిన స్థలమదిగో‖ 2x ‖
మూడవసారి బొంకిన వెంటనే‖ 2x ‖
కొక్కొరొకోయను కూతదిగో‖ 2x అదిగదిగో ‖
Verse
యూదుల రాజువు నీవేనా
మోదముతో నీవన్నట్లే‖ 2x ‖
నీలో దోషము కనుగొనలేక‖ 2x ‖
చేతులు కడిగిన పిలాతుడాడుగో‖ 2x అదిగదిగో ‖
Verse
గొల్గొతా స్థల అద్దరిని
ఆ ఇద్దరు దొంగల మధ్యమున‖ 2x ‖
సాక్షాత్తు యెహోవా తనయుని‖ 2x ‖
సిలువను వేసిరి చూడదిగో‖ 2x అదిగదిగో ‖
Verse
గొల్లున ఏడ్చిన తల్లదిగో
ఆ తల్లికి చెప్పిన మాటదిగో‖ 2x ‖
యూదుల రాజా దిగి రమ్మనుచు‖ 2x ‖
హేళన చేసిన మూకదిగో‖ 2x అదిగదిగో ‖
Verse
దాహము గొనుచున్నాననుచు
ప్రాణము విడిచెను పావనుడు‖ 2x ‖
పరిశుద్ధుడు మన రక్షకుడేసు‖ 2x ‖
మన మది యేమో గమనించు‖ 2x అదిగదిగో ‖

Related Tags

Good FridayCalvaryPassion Week