Verse 1
Reference: నిత్యుడగు తండ్రి యెషయా Isaiah 9:6
Verse
అద్యంతరహితుడవగు మా జ్యోతి
మేదిని ప్రభూ నిన్ స్తుతింతుము - మేదిని‖ మేదిని ‖
నా దీన కాపరి నీతి కృపానిధి
శుధ్ధ దివ్యగత్రుడా
Verse
మనోహరమగు నీ కృప పొందను
మానవు లెల్లరము చేరితిమి - మానవు‖ మానవు ‖
ఆత్మరూప కృపామయా నీ కరుణా
వరముల మాకీయుమా
Verse
పాలచే కడుగబడిన - ధవళాక్షుడా
వళ్లిపూలయందు తిరుగువాడా - వళ్లి‖ వళ్లి ‖
షాలేము రాజా షారోను రోజా
శాంత భూపతివి నీవే
Verse
లక్షల దూతల స్తుతుల నందువాడా
అక్షయ హేమమకుట ధారుడా - అక్షయ‖ అక్షయ ‖
హేమ కిరీటధారులమై స్వర్గంబు
చేర కడవరి వర్షమీ
Verse
క్రొత్త యెరూషలేం నగర రాజా
రత్నాల పునాది వేసితివి - రత్నాల‖ రత్నాల ‖
ధీరతతో నీ సాక్ష్యము చాటను
స్థిరమగునాత్మ నిమ్ము
Verse
శ్రేష్ఠురాలా పావురమా నిరుపమాన
ఇష్టంపురూప లావణ్యవతీ - ఇష్ట‖ ఇష్ట ‖
అట్లంచు పిల్చు దివ్య ధ్వనికి మమ్ము
పాత్రులుగా చేయుమా