Verse
అడిగినది కొంతే అయినా
పొందినది ఎంతో దేవా
ప్రతిగా ఏమివ్వగలనయ్యా
నిను స్తుతియించె హృదయము తప్ప
నా జీవితం నీకే అంకితమయ్యా‖ అడిగినది ‖
Verse
ఊహించలేని వివరింపజాలని
నీ కార్యములు ఆశ్చర్యమే
యోచించినా నా వర్ణనకందని
నీ కృపా కనికరములు అత్యున్నతమే‖ 2x ‖
తరతరములకు మారని నీ ఉన్నత ప్రేమా
యుగయుగములకు నీకే ఘనతా మహిమా
సతతం నిను నే కొనియాడెదను
సకలం నీ నామముకే స్తోత్రము తగును‖ అడిగినది ‖
Verse
క్షణ భంగురం నా క్షయ జీవితం
కాచావయ్యా నను నీ రెక్కల నీడ
ఏ యోగ్యత లేని అల్పుడను నన్ను
హెచ్చించావయ్యా నీ ప్రేమ తోడ‖ 2x ‖
నా ఆశ్రయ దుర్గము నీవే యేసయ్య
నా రక్షణ శృంగము నీవే మెస్సయ్య
నా స్తుతికి పాత్రుడవు నీవేనయ్యా
ఈ స్తోత్ర కీర్తన నీకేనయ్యా‖ అడిగినది ‖
Verse
మహిమోన్నతుడా నను మరువని విభుడా
ప్రణుతించెదను నిన్నే నిరతం
నిష్కలంకుడా నిర్మలాత్ముడా
ఫ్రచురించెదను నీ పావన చరితం‖ 2x ‖
నా అతిశయము నీవే నా యేసయ్యా
నా ఆధారము నీవే నా మెస్సయ్యా
నా ఆరాధన ఆలాపన నీకేనయ్యా
ఈ దీనుని సేవను చేకొనుమయ్యా‖ అడిగినది ‖