Verse
అదిగో నా నావ బయలు దేరుచున్నది
అందులో యేసు ఉన్నాడు
నా నావలో క్రీస్తు ఉన్నాడు‖ 2x ‖
Verse
వరదలెన్ని వచ్చినా వణకను
అలలెన్ని వచ్చినా అదరను‖ 2x ‖
ఆగిపోయే అడ్డులొచ్చినా
సాగిపోయే సహాయం మనకు ఆయనే‖ 2x అదిగో ‖
Verse
నడిరాత్రి జాములో నడచినా
నది సముద్ర మధ్యలో నిలచినా‖ 2x ‖
నడిపించును నా యేసు
నన్నూ అద్దరికి చేర్చును‖ 2x అదిగో ‖
Verse
లోతైన దారిలో పోవుచున్నది
సుడిగుండాలెన్నో తిరుగుచున్నవి‖ 2x ‖
సూర్యుడైన ఆగిపోవును
చుక్కాని మాత్రం సాగిపోవును‖ 2x అదిగో ‖