Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Adigo Vachchunadevaro Chooduma Mahima Galigina Mana Yesae

అదిగో వచ్చునదెవరో చూడుమా మహిమ గలిగిన మన యేసే

Adigo Vachchunadevaro Chooduma Mahima Galigina Mana Yesae

Chorus
అదిగో వచ్చునదెవరో చూడుమా - మహిమ గలిగిన మన యేసే
నీ కన్నులెత్తి చూడుమా - క్రీస్తు ప్రభావముతో వచ్చుచుండెన్
Verse
మేఘారూఢుడై అచ్చుచున్నాడు - కంపించెను ఆకాశమెల్ల
వీణె వాయింప దూతల్ పాడంగ - పెండ్లి కుమారుండై వచ్చుచుండెన్
Verse
సూర్యచంద్రులు అదృశ్యులైరి - మౄతులెవ్వరులేరు అచ్చట
అందరు భయపడి వణకుచున్నారు - తీర్పుచేయ క్రీస్తు వచ్చుచుండెన్
Verse
గతించును మనమున్న లోకము - నూతన లోక మొకటి కలుగును
నూతన మగును జగమంతయును - క్రీస్తు రాజ్యమేల వచ్చుచుండెన్
Verse
ముండ్ల మకుటము నింకలేదు - మహిమ కిరీటము ధరించెను
అలంకారముతో అందమైయున్న - పెండ్లి కుమార్తెకై వచ్చుచుండెన్

Related Tags

Second ComingGloryJesus Christ