Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Adugaduguna Raktha Bindhuvule

అడుగడుగున రక్త బింధువులే

Adugaduguna Raktha Bindhuvule

Verse
అడుగడుగున రక్త బింధువులే
అణువణువున కొరడా దెబ్బలే‖ 2x ‖
నా యేసుకు ముళ్ల కిరీటం
భుజములపై సిలువ భారం‖ 2x ‖
భుజములపై సిలువ భారం‖ అడుగడుగున ‖
Verse
సిలువ మోయుచు వీపుల వెంట
రక్త ధరలే నిన్ను తడిపెను‖ 2x ‖
నా ప్రజలారా ఏడవకండి
మీ కోసము ప్రార్ధించండి‖ 2x అడుగడుగున ‖
Verse
కలువరిలోన నీ రూపమే
నలిగిపోయెను నా యేసయ్యా‖ 2x ‖
చివరి రక్త బిందువు లేకుండా
నా కోసమే కార్చినావు‖ 2x అడుగడుగున ‖
Verse
మరణము గెలిచి తిరిగి లేచిన
మృత్యుంజయుడా నీకే స్తోత్రం‖ 2x ‖
మహిమ స్వరూపా మా యేసయ్యా
మహిమగా నన్ను మార్చినావా‖ 2x అడుగడుగున ‖

Related Tags

SacrificeJesusPassionCalvary