Verse
అడుగుచున్నా మో దేవ కడు దయను గావఁ జెడుగుల మైన మేము
ని న్నడుగుటకు నే బిడియ మొందము అడుగుఁడి మీ కిడియెద నంచు
నాన తిచ్చిన వాగ్దానమునఁ గని‖ అడుగు ‖
Verse
వేడు కలరఁగఁ గూడి నిను గొని యాడి యడిగెడు నీదు భక్తులఁ గోడు
గని దయతోడ నెప్పుడు వీడక నెరవేర్తు వని ని‖ అడుగు ‖
Verse
సారె సారెకు నిన్ను విడిచి ఘోర దురితపు భారమందుఁ జేరి నిను
మఱచితిమి గద మా క్రూరత నెడ బాపు మని ని‖ అడుగు ‖
Verse
దుష్టుడు మాతోడఁ బోరఁగ శ్రేష్ఠ మగు మానిష్ఠ తోడుత కష్ట మనక
వాని గెల్వఁ బుష్టిని బుట్టించు మని ని‖ అడుగు ‖
Verse
తోర మగు విశ్వాస నిరీక్షణ కూరిమి విమలాత్మ వరములు వారక
హృదయాంతరంబులఁ జేరిచి మము వెలిగించు మని ని‖ అడుగు ‖
Verse
మోద మొప్పఁగ నీదు వాక్యము మేదినిపై బోధపరచెడు బోధ కులపై
శోధనంబులు పొర్లి రాకుండాదరింప‖ అడుగు ‖
Verse
దురితముల చే భరితు లయ్యెడు నరులపై నీ కరుణఁ జూపి
గురుతరంబగు మారు పుట్టుక వరముఁ గుమ్మరించు మని ని‖ అడుగు ‖
Verse
రోగములచే సేగి నొందుచు జాగు సేయక నినుఁ దలఁచుచు బాగు
గోరుచు నున్న భక్తుల రోగములు వెడలించు మని ని‖ అడుగు ‖
Verse
ధరణిపైని మరణ మయ్యెడు తరుణమందో కరుణా కలితా పరమ
పురమునందుఁజేరి వర సుఖంబు లనుభవింప‖ అడుగు ‖