Verse
అడుగుడి మీకు ఇవ్వబడును
వెదకుడి మీకు దొరుకును‖ 2x ‖
తట్టుడి మీకు తీయబడును‖ 2x ‖
అని యేసుడు మీతో చెప్పుచుండగా
అడగక వెదకక తట్టక తిరుగుచుందురా
తిరుగుచుందురా మీరు తిరుగుచుందురా‖ అడుగుడి ‖
Verse
అడగమని నా యేసు మీకు చెప్పగా
అడగక ఈ ఆగడాలు దేనికి‖ 2x ‖
ఈ క్షణమే యేసయ్యను చేరుకో
అడిగి నీ దీవెనలు పొందుకో
పొందుకో దీవెనలు పొందుకో‖ అడుగుడి ‖
Verse
వెదకమని నా ప్రభువు మీకు చెప్పగా
వెదకక ఈ వాదులాట దేనికి‖ 2x ‖
వెంటనే యేసయ్యను వేడుకో
పోగొట్టుకున్న ఫలములన్ని దొరుకును
దొరుకును నీ ఫలములన్ని దొరుకును‖ అడుగుడి ‖
Verse
తట్టమని నా తండ్రి మీకు చెప్పగా
తట్టక ఈ తడవులాట దేనికి‖ 2x ‖
తక్షణమే తండ్రి తట్టు తిరుగుము
తెరువబడిన మార్గములో సాగుము
సాగుము మార్గములో సాగుము‖ అడుగుడి ‖