Chorus
అడుగుడి మీరు మన ప్రభువిచ్చున్ - తప్పక యిచ్చున్
అడిగెడి ప్రతివాడు పొందున్
Verse
భక్తులుభక్తులు విశ్వాసముతో - ప్రార్థించి పొందిరి
వారి జీవితముల నెంచి చూచి
మీ మేలు కొరకై ప్రార్థించి పొందు
Verse
మనలో తన శక్తికొలది - అనుగ్రహించును
ఊహకుమించి చేయు దేవునిని
మీ మేలు కొరకై ప్రార్థించి పొందు
Verse
మన ప్రార్థనల నాలకించి - సంతృప్తి చెందును
తన నామమునకు మహిమ కలుగ
మీ మేలు కొరకై ప్రార్థించి పొందు
Verse
ఇదివరకు మీరేమియు - అడుగకుంటిరి
మీరానంద భరితులగునట్లు
మీ మేలు కొరకై ప్రార్థించి పొందు
Verse
దేవుని కేదైనను - చేయ నసాధ్యమా
సర్వశక్తిగల మన దేవునడిగి
ప్రభు మహిమ కొరకై ప్రార్థించి పొందు