Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Adviteeyuda Nannelu Daivamaa

అద్వితీయుడా నన్నేలు దైవమా

Adviteeyuda Nannelu Daivamaa

Lyricist: Hosanna Ministries Guntur
Verse
అద్వితీయుడా నన్నేలు దైవమా
వర్ణించలేను స్వామి నీ గొప్ప కార్యములను
మదిలోన నీ రూపం నీ నిత్య సంకల్పం
ప్రతిఫలింపజేయునే ఎన్నడూ
కలనైన తలంచలేదే నీలో ఈ సౌభాగ్యము
వర్ణించలేను స్వామీ నీ గొప్పకార్యాలను
నీ సాటి లేరు ఇలలో అద్వితీయుడా
Verse
ప్రతీ గెలుపు బాటలోన చైతన్యస్పూర్తి నీవై నడిపించుచున్న నేర్పరీ
అలుపెరుగని పోరాటాలే ఊహించని ఉప్పెనలై నను నిలువనీయ్యని వేళలో
హృదయాన కొలువైయున్న ఇశ్రాయేలు దైవమా
జయమిచ్చి నడిపించితివే నీ ఖ్యాతికై
తడి కన్నులనే తుడిచిన నేస్తం ఇలలో నీవే కదా! యేసయ్యా
Verse
నిరంతరం నీ సన్నిధిలో నీ అడుగుజాడలలోనే సంకల్పదీక్షతో సాగెదా
నీతో సహజీవనమే ఆధ్యాత్మిక పరవశమై ఆశయాలదిగా నడిపెనే
నీ నిత్య ఆదరణే అన్నిటిలో నెమ్మదినిచ్చి
నా భారమంతా తీర్చి నా సేద తీర్చితివి
నీ ఆత్మతో ముద్రించితివి నీ కొరకు సాక్షిగా! యేసయ్యా
Verse
విశ్వమంతా ఆరాధించే స్వర్ణరాజ్య నిర్మాతవు స్థాపించుము నీ ప్రేమ సామ్రాజ్యము
శుద్ధులైనవారికి ఫలములిచ్చు నిర్ణేతవు ఆ గడియవరకు విడువకూ
నే వేచియున్నాను నీ రాక కోసమే
శ్రేష్టమైన స్వాస్థ్యము కోసం సిద్ధపరచుమా
నా ఊహలలో ఆశలసౌధం ఇలలో నీవేనయ్యా! యేసయ్యా

Related Tags

PraiseWorshipDevotional