Verse
అద్వితీయ సత్యదేవా వందనం
పరమ తండ్రీ పావనుండా వందనం
దివ్య పుత్ర యేసునాధా వందనం
పావనాత్మ శాంతిదాత వందనం‖ హల్లెలూయా ‖
Verse
వ్యోమ సింహాసనస్తుడ వందనం
ఊర్విపాధ పీఠస్తుడ వందనం
అద్యంత రహిత నీకు వందనం
అక్షయు కరుణేెక్షుండ వందనం‖ హల్లెలూయా ‖
Verse
నీతి న్యాయ దీర్ఘశాంత వందనం
నిర్మలాదయా నితాంత వందనం
సిలువదారి ప్రేమముర్తి వందనం
యుక్త స్తోత్రార్హూండ వందనం‖ హల్లెలూయా ‖