Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Ae Baadha Laedhu Ae Kashtam Laedhu Yaesu Thoadumdagaa

ఏ బాధ లేదు ఏ కష్టం లేదు యేసు తోడుండగా

Ae Baadha Laedhu Ae Kashtam Laedhu Yaesu Thoadumdagaa

Chorus
ఏ బాధ లేదు ఏ కష్టం లేదు యేసు తోడుండగా
ఏ చింత లేదు ఏ నష్టం లేదు ప్రభువే మనకుండగా
దిగులేలా ఓ సోదరా ప్రభువే మనకండగా...
భయమేల ఓ సోదరీ యేసే మనకుండగా...
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయు హల్లెలూయా‖ 2x ‖
Verse
ఎర్ర సంద్రం ఎదురొచ్చినా యెరికో గోడలు అడ్డాచ్చినా
సాతానే శోధించినా శత్రువులే శాసించినా
పడకు భయపడకు బలవంతుడే నీకుండగా
నీకు మరి నాకు ఇమ్మానుయేలుండగా…‖ దిగులేలా ‖
Verse
పర్వతాలు తొలగినా మెట్టలు దద్దరిల్లినా
తుఫానులే చెలరేగినా వరదలే ఉప్పొంగినా
కడకు నీ కడకు ప్రభుయేసే దిగి వచ్పుగా
నమ్ము ఇది నమ్ము యెహెూవా యీరే గదా…‖ దిగులేలా ‖

Related Tags

ComfortJesusProtection