Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Ae Baadha Ledu

ఏ బాధ లేదు

Ae Baadha Ledu

Verse
ఏ బాధ లేదు ఏ కష్టం లేదు యేసు తోడుండగా
ఏ చింత లేదు ఏ నష్టం లేదు ప్రభువే మనకుండగా
దిగులేల ఓ సోదరా ప్రభువే మనకండగా
భయమేల ఓ సోదరీ యేసే మనకుండగా
హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ – హల్లెలూయ‖ 2x ఏ బాధ ‖
Verse
ఎర్ర సంద్రం ఎదురొచ్చినా
యెరికో గోడలు అడ్డొచ్చినా
సాతాను శోధించినా
శత్రువులే శాసించినా
పడకు భయపడకు బలవంతుడే నీకుండగా
నీకు మరి నాకు ఇమ్మానుయేలుండగా‖ దిగులేల ‖
Verse
పర్వతాలు తొలగినా
మెట్టలు తత్తరిల్లినా
తుఫానులు చెలరేగినా
వరదలు ఉప్పొంగినా
కడకు నీ కడకు ప్రభు యేసే దిగి వచ్ఛుగా
నమ్ము ఇది నమ్ము యెహోవా యీరే కదా‖ దిగులేల ‖

Related Tags

FaithEncouragementHope