Verse
ఏ చెట్టు గుట్ట పుట్ట మట్టి మోక్ష్యమునీయదయ్యా
ఏ రాయి రప్ప దేవుళ్లంతా మార్గము చూపరయ్యా‖ 2x ‖
యేసే నిజ దేవుడు – పాపుల రక్షించును‖ 2x ఏ చెట్టు ‖
Verse
పాపమంతయూ తొలగింపను – దైవమే దిగి వచ్చెను
గొర్రెపిల్లగా తల వంచెను – ప్రాణమునే అర్పించెను
నరుల పాపము తన భుజాలపై
మోపుకొనెను పరమ దేవుడు‖ 2x ‖
నమ్మిన వారై రక్షణ పొంద
స్వర్గానికే చేరుకుందమా‖ 2x ఏ చెట్టు ‖
Verse
మహిమ రూపుడే మనిషి జన్మలో – భువికి అవతరించెను
సిలువ మ్రానుపై వ్రేళాడెను – రక్తము చిందించెను
యేసు లేచెను మరణము గెలిచి
నమ్మిన వారిని పరమును చేర్చ‖ 2x ‖
హల్లెలూయా ఆనందమే
హల్లెలూయా సంతోషమే‖ 2x ఏ చెట్టు ‖