Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Ae Gumpulo Nunnaavo

ఏ గుంపులో నున్నావో

Ae Gumpulo Nunnaavo

Verse
ఏ గుంపులో నున్నావో
ఎరిగి తెలుసుకో – గుర్తెరిగి తెలుసుకో‖ 2x ‖
జాగు చేయక వేగ మేలుకో‖ 2x ఏ గుంపులో ‖
Verse
మరణమనెడి మొదటి గుంపు
మారని గుంపు – నిర్జీవపు గుంపు‖ 2x ‖
దురాత్మ బలముతో తిరిగెడి గుంపు‖ 2x ఏ గుంపులో ‖
Verse
మెచ్చుఁకొనుట కిచ్చకంబు
లాడెడి గుంపు – నులివెచ్చని గుంపు‖ 2x ‖
చచ్చియుండిన సమాధుల గుంపు‖ 2x ఏ గుంపులో ‖
Verse
కరుణ లేక కఠినమైన
కరుగని గుంపు – గుర్తెరుగని గుంపు‖ 2x ‖
కరకు కల్గిన కఠోరపు గుంపు‖ 2x ఏ గుంపులో ‖
Verse
యేసు వాక్యమనగ నేమో
ఎరుగని గుంపు – విననియ్యని గుంపు‖ 2x ‖
ముద్ర వేసిన మూర్ఖుల గుంపు‖ 2x ఏ గుంపులో ‖
Verse
ధరణి నరుల తరిమి కొట్టు
దయ్యపు గుంపు – అదే కయ్యపు గుంపు‖ 2x ‖
పరమ తండ్రిని ఎదిరించెడి గుంపు‖ 2x ఏ గుంపులో ‖
Verse
పరమ తండ్రి కడకు జేర
పరుగులెత్తెడి – నిరపరాధ జనులకు‖ 2x ‖
కావలి కాయు కఠినాత్ముల గుంపు‖ 2x ఏ గుంపులో ‖
Verse
సర్వ లోక మోసగాడు
ఆది సర్పము – అదే ఘట సర్పము‖ 2x ‖
సర్వ భక్తుల బరి మార్చెడి గుంపు‖ 2x ఏ గుంపులో ‖
Verse
వధువు మంద మేయు మర్మ
మనగ గమనిక – గమనించి తెలుసుకో‖ 2x ‖
గదిలో చేరుకో పదిలపర్చుకో‖ 2x ఏ గుంపులో ‖

Related Tags

Christian LifeWarningSpiritual Discernment