Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Ae Naamamulo

ఏ నామములో

Ae Naamamulo

Lyricist: Anu Samuel
Verse
ఏ నామములో సృష్టి అంతా సృజింపబడెనో
ఆ నామమునే స్తుతింతును
ఏ నామములో పాపమంతా క్షమించబడెనో
ఆ నామమునే పూజింతును
ఏ నామములో దావీదు గోలియాతును ఎదురించెనో
ఆ నామమునే నమ్మెదను
ఏ నామములో ఈ లోకమంతటికి రక్షణ కలుగునో
ఆ నామమునే స్మరింతును
Chorus
నీ నామమునే ధ్వజముగ పైకెత్తెదను
నీ నామమే ఆధారము
నీ నామమునే ధ్వజముగ పైకెత్తెదను
నీ నామమే నా జయము
Verse
రోగము తలవంచును నీ నామము ఎదుట
శాపము తల వంగును నీ నామము ఎదుట‖ 2x ‖
సాటిలేని నామము – స్వస్థపరచే నామము‖ 2x నీ నామమునే ‖
Verse
ప్రతి మోకాలొంగును నీ నామము ఎదుట
ప్రతి నాలుక పలుకును ప్రభు యేసుకే ఘనత‖ 2x ‖
శ్రేష్టమైన నామము – శక్తిగలిగిన నామము‖ 2x నీ నామమునే ‖
Outro
హెచ్చింపబడును గాక నీ నామము యేసయ్యా
కీర్తింపబడును గాక నీ నామము యేసయ్యా
కొనియాడబడును గాక నీ నామము యేసయ్యా
అన్ని నామములకు పై నామముగా‖ 2x ‖
అన్ని నామములకు పై నామముగా –‖ 3x నీ నామమునే ‖

Related Tags

PraiseWorshipJesus