Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Ae Paapa Merugani Yopaavana Moorthi

ఏ పాప మెఱుఁగని యోపావన మూర్తి

Ae Paapa Merugani Yopaavana Moorthi

Lyricist: Yarmanashetti David
Chorus
ఏ పాప మెఱుఁగని యోపావన మూర్తి పాప విమోచకుండ నా పాలి
దైవమా నా పాపముల కొఱ కీ పాట్లు నొందినావా‖ యే పాప ‖
Verse
ముళ్లతోఁ గిరీట మల్లి నీ శిరముపై జల్లాటమున మొత్తిరా ముళ్లపోట్లకు
శిరము తల్లడిల్లగ సొమ్మ సిల్లిపోతివ రక్షకా‖ యే పాప ‖
Verse
కలువరి గిరి దనుక సిలువ మోయలేక కలవరము నొందినావా సిలువ
నీతో మోయఁ తులువలు వేఱొకనిఁ దోడుగా నిచ్చినారా‖ యే పాప ‖
Verse
చెడుగు యూదులు బెట్టు పడరాని పాట్లకు సుడివడి నడచినావా
కడకుఁ కల్వరి గిరి కడ కేగి సిల్వను గ్రక్కున దించినావా‖ యే పాప ‖
Verse
ఆ కాల కర్ములు భీకరంబుగ నిన్ను ఆ కొయ్యపై నుంచిరా నీ కాలు
సేతులు ఆ కొయ్యకే నూది మేకులతో గ్రుచ్చినారా‖ యే పాప ‖
Verse
పలువిధంబుల శ్రమలు చెలరేగఁ దండ్రికి నెలుగెత్తి మొఱలిడితివా
సిలువపైఁ బలుమాఱు కలుగుచుండెడి బాధ వలన దాహము నాయెనా‖ యే పాప ‖
Verse
బల్లిదుండగు బంటు బల్లెమున నీ ప్రక్కఁ జిల్లిఁ బడఁ బొడిచి నాఁడా
ఉల్లోలములవలె నల్ల నీరుబుకంగఁ జల్లారెఁగద కోపము‖ యే పాప ‖
Verse
కటకటా పాప సం కటముఁ బాపుట కింత పటుబాధ నొంది నావా
ఎటువంటి దీ ప్రేమ యెటువంటి దీ శాంతి మెటుల వర్ణింతు స్వామి‖ యే పాప ‖

Related Tags

Good FridayPassion Of ChristCrucifixion