Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Ae Paapamerugani

ఏ పాపమెరుగని

Ae Paapamerugani

Lyricist: Yarmanishetti Daaveedu
Verse
ఏ పాపమెరుగని యో పావన మూర్తి పాప విమోచకుండా
నా పాలి దైవమా నా పాపముల కొర కీ పాట్లు నొందినావా
Verse
ముళ్ళతో కిరీట – మల్లి నీ శిరముపై – జల్లాటమున మొత్తిరా
ముళ్ళ పోట్లకు శిరము – తల్లడిల్లగ సోమ్మ – సిల్లిపోతివ రక్షకా‖ ఏ పాప ‖
Verse
కలువరి గిరి దనుక – సిలువ మోయలేక – కలవరము నొందినావా
సిలువ నీతో మోయ – తులువలు వేరొకని – తోడుగా నిచ్చినారా‖ ఏ పాప ‖
Verse
చెడుగు యూదులు బెట్టు – పడరాని పాట్లకు – సుడివడి నడచినావా
కడకు కల్వరి గిరి – కడ కేగి సిల్వను – గ్రక్కున దించినావా‖ ఏ పాప ‖
Verse
ఆ కాల కర్ములు – భీకరంబుగ నిన్ను – ఆ కొయ్యపై నుంచిరా
నీ కాలు సేతులు – ఆ కొయ్యకే సూది – మేకులతో గ్రుచ్చినారా‖ ఏ పాప ‖
Verse
పలువిధంబుల శ్రమలు – చెలరేగ దండ్రికి – నెలుగెత్తి మొరలిడితివా
సిలువపై పలుమారు – కలుగుచుండెడి బాధ – వలన దాహము నాయెనా‖ ఏ పాప ‖
Verse
బల్లిదుండగు బంటు – బల్లెమున నీ ప్రక్క – జిల్లి బడ బొడచినాడా
ఉల్లోలములవలె నల్ల నీరుబుకంగ జల్లారె గద కోపము‖ ఏ పాప ‖
Verse
కట కటా పాప సం – కటము బాపుట కింత – పటు బాధ నొందినావా
ఎటువంటిదీ ప్రేమ – యెటువంటిదీ శాంత – మెటుల వర్ణింతు స్వామి‖ ఏ పాప ‖

Related Tags

WorshipRepentanceGood FridayPassion Of Christ