Verse
ఏ పాటిదో నా జీవితం ఎలాంటిదో ఆ నా గతం
ప్రభు యేసులో నా జీవితం మారిపోయేగా ఆ నా గతం
నన్ను ప్రేమించినా నాకై మరణించినా
నన్ను విడిపించినా యేసుకే...‖ 2x ‖
ప్రభుయేసు నీకే స్వాగతం మారిపోయేగా ఆ నా గతం‖ 2x ‖
Verse
ఎందుకో పుట్టానని నా బ్రతుకే దండగని‖ 2x ‖
పనికిరాని వాడనని పైకి అసలే రాలేనని
పదిమంది ననుచూసి గేలి చేయువేళ. ఆ. ఆ..
పనికొచ్చే పాత్రగా నను చేసినా పరిశుద్ధునిగా నను మార్చినా
యేసయ్యానీకే స్తోత్రము మెస్సయ్యానీకే స్తోత్రము‖ 2x ‖
Verse
అందచందాలు లేవని చదువు సంధ్యలే అబ్బని‖ 2x ‖
తెలివి తక్కువ వాడనని లోక జ్ఞానమే లేదని
పదిమంది నను చూసి గేలి చేయువేళ. ఆ..ఆ..
పరిశుద్ధాత్మతో నను నింపినా సిలువ సాక్షిగా నను మార్చినా
యేసయ్యానీకే స్తోత్రము మెస్సయ్యానీకే స్తోత్రము‖ 2x ‖