Chorus
ఏ రీతి నీ ఋణం తీర్చుకొందు యేసయ్యా‖ 2x ‖
ఏ దిక్కు లేని నన్ను ప్రేమించినావయ్యా
ఎంతో కృపను చూపి దీవించినావయ్యా‖ ఏ రీతి ‖
Verse
పాపాల సంద్రమందున పయనించు వేళలో‖ 2x ‖
పాశాన మనసు మార్చి పరిశుద్ధుని చేసావయ్యా‖ ఏ రీతి ‖
Verse
నా పాప శిక్ష సిలువపై భరియించినావయ్యా‖ 2x ‖
నా దోషములను గ్రహియించి క్షమియించినావయ్యా‖ ఏ రీతి ‖