Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Ae Reethi Sthuthiyinthuno - Ae Reethi Sevinthuno

ఏ రీతి స్తుతియింతునో – ఏ రీతి సేవింతునో

Ae Reethi Sthuthiyinthuno - Ae Reethi Sevinthuno

Verse
ఏ రీతి స్తుతియింతునో – ఏ రీతి సేవింతునో
నేరములెంచని వాడా – నాదు నజరేయుడా
తీరము దాటిన వాడా – నాదు గలలీయుడా
నా ప్రాణ నాధుండా – నీదు ప్రాణమిచ్చితివి
నేను నీ వాడనో యేసువా‖ ఏ రీతి ‖
Verse
వెదకి నను ఇల చేరితివి – వెంబడించగ పిలచితివి
రోత బ్రతుకును మార్చితివి – నీదు సుతునిగ జేసితివి‖ 2x నా ప్రాణ ‖
Verse
మహిమ నగరిని విడిచితివి – మంటి దేహము దాల్చితివి
సకల సంపద విడిచితివి – సేవకునిగా మారితివి‖ 2x నా ప్రాణ ‖
Verse
ఇంత ప్రేమకు కారణము – ఎరుగనైతిని నా ప్రభువా
ఎన్న తరమా నీ ప్రేమ – సన్నుతించుచు సాగెదను‖ 2x నా ప్రాణ ‖

Related Tags

WorshipDevotionalJesus