Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Ae samayamandhaina ae sthalamandhaina

ఏ సమయమందైనా ఏ స్థలమందైనా

Ae samayamandhaina ae sthalamandhaina

Chorus
ఏ సమయమందైనా ఏ స్థలమందైనా
ఏ స్థితిలో నేనున్నా స్తుతి పాడెదన్‖ 2x ‖
ఆరాధనా ఆరాధనా
నా ప్రియుడేసు క్రీస్తుకే ఆరాధనా
ఆరాధనా ఆరాధనా
గొర్రెపిల్ల క్రీస్తుకే ఆరాధనా‖ ఏ సమయమందైనా ‖
Verse
చెరసాలలో నేను బంధీగా ఉన్నా
సింహాల బోనులో పడవేసినా
కరువు ఖడ్గము హింస ఎదైననూ
మరణ శాసనమే పొంచున్ననూ
యేసు నామమే ఆధారము కాదా
యేసు రక్తమే నా విజయము
పగలు ఎండలలో రాత్రి వెన్నెలలో
కునుకక కాపాడు యేసు దేవునికే‖ ఆరాధనా ‖
Verse
నా జీవనాధారం శ్రీ యేసుడే
నా స్తుతికి పాత్రుడు ప్రభు క్రీస్తుడే
తన చేతులతో నన్ను నిర్మించెగా
నా సృష్టికర్తను కొనియాడెదన్
యెహోవ రాఫా నను స్వస్థ పరిచెను
యెహోవ షమ్మా నాకు తోడుగా
యెహోవ నిస్సీ నా ధ్వజముగా
అల్ఫా ఒమేగా ఆది దేవునికే‖ ఆరాధనా ‖

Related Tags

PraiseWorshipDevotional