Verse
ఏ వ్యక్తినైనా ఏ స్థితియందైనా ఎంతగానో ప్రేమించు ప్రేమ
యెన్నడూ దాటిపోని ప్రేమా ఆ ఆ
యెన్నడూ దాటిపోని ప్రేమ.
ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ
ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ
అన్ని కాలములలో ఉన్న ప్రేమ అందరినీ ప్రేమించే యేసు ప్రేమ
ఏ వ్యక్తినైనా ఆ
Verse
తారతమ్యముచూపని ప్రేమ తరిగిపొని యేసుదివ్య ప్రేమ‖ 2x ‖
తగనివారినెల్లా తనవారిగనెంచి‖ 2x ‖
తనసొత్తుగ చేసుకున్న ప్రేమ తనరాజ్యమునకు పిలచిన ప్రేమ‖ 2x ‖
ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ
ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ
అన్ని కాలములలో ఉన్న ప్రేమ అందరినీ ప్రేమించే యేసు ప్రేమ
ఏ వ్యక్తినైనా ఆ
Verse
దివినుండి బువికేగిన ప్రేమ దీనులరక్షించిన ఘన ప్రేమ‖ 2x ‖
ధరబాంధవ్యాలు తెగిపొయినగానీ‖ 2x ‖
విడిపోని బంధము ఈ ప్రేమ కడుశాస్వతమైనది ఈ ప్రేమ‖ 2x ‖
ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ
ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ
అన్ని కాలములలో ఉన్న ప్రేమ అందరినీ ప్రేమించే యేసు ప్రేమ
ఏ వ్యక్తినైనా ఆ
Verse
శక్తివంతమైన యేసుప్రేమ తనరక్తనిబంధన ఈ ప్రేమ‖ 2x ‖
దోషిని క్షమియించి దోషము తొలగించి‖ 2x ‖
సిలువలో బలియైన యేసుప్రేమ ఏదొషములేని గొప్ప ప్రేమ‖ 2x ‖
ప్రేమ ప్రేమ ప్రేమ
ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ
అన్ని కాలములలో ఉన్న ప్రేమ అందరినీ ప్రేమించే యేసు ప్రేమ
ఏ వ్యక్తినైనా ఆ