Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Ae Yogyathaa Leni

ఏ యోగ్యతా లేని

Ae Yogyathaa Leni

Verse
ఏ యోగ్యతా లేని నన్ను నీవు ప్రేమించినావు దేవా
ఏ అర్హతా లేని నన్ను నీవు రక్షించినావు ప్రభువా
నీకేమి చెల్లింతును
నీ ఋణమెలా తీర్తును‖ 2x ఏ యోగ్యతా ‖
Verse
కలుషితుడైన పాపాత్ముడను
నిష్కళంకముగా నను మార్చుటకు‖ 2x ‖
పావన దేహంలో గాయాలు పొంది‖ 2x ‖
రక్తమంత చిందించినావా‖ నీకేమి ‖
Verse
సుందరమైన నీ రూపమును
మంటివాడనైన నాకీయుటకు‖ 2x ‖
వస్త్రహీనుడుగా సిలువలో వ్రేళాడి‖ 2x ‖
నీ సొగసును కోల్పోయినావా‖ నీకేమి ‖
Verse
పాపము వలన మృతినొందిన
అపరాధినైన నను లేపుటకు‖ 2x ‖
నా స్థానమందు నా శిక్ష భరించి‖ 2x ‖
మరణించి తిరిగి లేచావా‖ నీకేమి ‖

Related Tags

WorshipGraceSalvation