Chorus
ఏల వర్ణించనయ్యా కల్వరి యాగం
ఆ సిలువ ప్రయాణం‖ 2x ‖
ఏమని కొనియాడనయ్యా నీ రక్షణ త్యాగం
ఆ రక్త ప్రయాసం
ఏల వర్ణించనయ్యా కల్వరి యాగం
ఆ సిలువ ప్రయాణం
నీ రక్తమిచ్చి నను కొన్న ప్రయాణం
నీ ప్రాణమిచ్చి నాకు విలువిచ్చిన త్యాగం
ఏల వర్ణించనయ్యా…
Verse
వీరేమి చేయుచున్నారో ఎరుగరని క్షమించి‖ 2x ‖
నీ గొప్ప క్షమాగుణము నీవు నాకు నేర్పితివా‖ 2x ఏల ‖
Verse
నీవు పరదైసులో ఉందువని దొంగతో‖ 2x ‖
నా స్తితి గమనించి నా పాపము క్షమియించినావా‖ 2x ఏల ‖
Verse
నీ తల్లిని నీ శిష్యునకు అప్పగించినావా‖ 2x ‖
నా తల్లిని నా తండ్రిని గౌరవించుమన్నవా‖ 2x ఏల ‖
Verse
నా దేవా నా దేవా నను విడనాడితివన్నావా‖ 2x ‖
నా పాప భారము మోసి నన్ను విడిపించినావా‖ 2x ఏల ‖
Verse
నేను దప్పిగొన్నానని నీవు మొర్ర పెట్టినావా‖ 2x ‖
నా హృదయమే నీ దాహం నా రక్షణే నీ త్యాగమయా‖ 2x ఏల ‖
Verse
నీవు సమాప్తమైనదని నీ ఆత్మను అప్పగించి‖ 2x ‖
నీ తండ్రి చిత్తమునే నీవు నెరవేర్చినావా‖ 2x ఏల ‖
Verse
అప్పగించినావా నీ అత్మను నీ తండ్రికి‖ 2x ‖
నా ఆత్మను పరము చేర్చ మార్గమునే తెరచినావా‖ 2x ఏల ‖