Chorus
ఏమి లేదు సుమీ జగములో యేసుని ప్రేమ సారము కన్నను పామరం
బేటికి వృధా కను దామరలు మూయగనె చీకటి యౌ మనంబున నెల్ల
సత్యము గామి గని సర్వంబు విడువుఁ‖ ఏమి ‖
Verse
దార పుత్రాది బంధు శ్రేణిపై మమ కార భావము జెందుచుఁ
తద్విషయమై కోరి దుఃఖము లొందుచు భ్రమఁ గుందుచు భూరి
మాయా జాల బంధా కర మిది యని తెలియ కీ సం సార మంతయు
నాది నాదని యూరకే చెడిపోవ నేటికి‖ నేమి ‖
Verse
ఈ దేహమునకుఁ బ్రాణమునకు సంబంధ మించు కైనఁ గలదా
దేహాత్మలకు భేదము గన వలదా బుద్ధి గొన వలదా యాది నే దేహము
నాత్మ స మాదరంబున నుండు నా తను వీ ధరిత్రిని విడచి చను
నపుడే దయామృతవార్ధి దిక్కగు‖ నేమి ‖
Verse
జాయా పుత్రోద్యాన గృహ విత్తా ట్టాలక సకల వస్తు జాలము ప్రతిష్ఠాను
భూతి విధేయులు నఖిల సంపదలు నీ యవని లోపల సమర్పణఁ
జేయఁగా బడుఁ గాని యించుక తోయమును గొని పోవశక్యము లేద
హా భ్రమ నొంద నేటికి‖ నేమి ‖