Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Aemi Naenu Samarpimthu Yaesoo Yetlu

ఏమి నేను సమర్పింతు యేసూ యెట్లు

Aemi Naenu Samarpimthu Yaesoo Yetlu

Lyricist: Pulipaka Jagannadhamu
Chorus
ఏమి నేను సమర్పింతు యేసూ యెట్లు నిన్ను స్తుతియింతు ఏమి
సమర్పింతు హీనుఁడ నగు నేను గామితార్థము లెల్ల గలుగఁజేయు
నీకు‖ ఏమి ‖
Verse
నేను మార్గముఁ దప్పియుండఁగ నన్ను నీవు కంటివి కరుణ నిండఁగ
దీనపాపులను దృఢముగఁ బ్రోవను దాన మిచ్చితివి తనర నీ ప్రాణము‖ ఏమి ‖
Verse
అందరి కొఱ కీవు తెచ్చిన మిగుల అందమైన నిత్య రక్షణ అంది నిన్ను
వినతి పొందుగఁ జేసెద నొందు మా నా నుతి నుత్తమ ప్రభు క్రీస్తు‖ ఏమి ‖
Verse
నీ యందే యానంద మొదఁగ యేసు నీదైన యాత్మ నాకందఁగ
జేయు మంచు నీకుఁ జేసెదఁ బ్రార్థన నాయందు దయచేసి నా మనవి
నాలించు‖ ఏమి ‖
Verse
నేను జేసిన యఘము లెల్లను గర్త నీ యెదుటఁ దలంచు కొందును
నేను సిగ్గు నొంది నిజముగఁ గుందుచు నేను వేఁడుకొందు నీ
క్షమాపణ కొరకు‖ ఏమి ‖
Verse
నన్ను నీవు స్థిరపరచుము కర్త యన్నిట నను బలపరుచుము తిన్నని
మార్గమున దృఢముగ నేగుచు నిన్ను నే స్తుతియింతు నిండుగ నెల్లప్పు‖ ఏమి ‖

Related Tags

WorshipDevotionalSurrender